ఒక ఆచరణాత్మక సమస్య శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం గురించి క్రితం టపా చదివిన వారిలో చాలామంది"ఆ పుస్తకం ఎక్కడ దొరుకుతుం"దని అడిగారు అడుగుతున్నారు.అందుకని పుస్తకంలో ఏముందో సమీక్షించే ముందు వారు అడిగినది చెప్తాను.
ఈ పుస్తకం కాకినాడ, రాజమండ్రి, విజయవాడ నగరాల్లో ఖాయంగా దొరుకుతుంది.హైదరాబాదులో భరోసా లేదు.ఎందుకంటే-ఈ సం. సెప్టెంబరులో హైదరాబాదుకి వచ్చిన ప్రతులు నవంబరు కాకుండానే చెల్లిపోయాయి.మా పేట చుట్టుపక్కల మాత్రం దొరకడంలేదు.అందుచేత నేను కూడా చీరాల నుంచి తెప్పించుకోవాల్సి వచ్చింది.రాబోయే రెండు నెలల్లో మరో ముద్రణ వెలువడబోతోంది కనుక కంగారేమీ లేదు.ఈ లోఫల ఈ పుస్తకం కావాల్సినవారు దాని గురించి అభ్యర్థిస్తూ ఈ క్రింది చిరునామాకి (ఒక్కొక్క ప్రతికి) రు.125 చెక్కు/డి.డి./ఎం.ఓ పంపి పోస్టులో తెప్పించుకోవచ్చు.
శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం
వేణుగోపాలస్వామి గుడి వీథి, పిఠాపురం,
తూర్పుగోదావరిజిల్లా ఆంధ్రప్రదేశ్ పిన్ - 533 450.
చెక్కు/డి.డి.లో pay అనే చోట ఉద్దేశించాల్సిన పేరు :శ్రీపాద శ్రీవల్లభ సేవాసంఘం పిఠాపురం.
0 వ్యాఖ్యలు ;:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
గమనిక :- ఇది సనాతన, సాంప్రదాయిక, ఆస్తిక, దేశభక్తియుత బ్లాగు.
రచయిత తన టపాలలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో విభేదించి పొఱపాట్లు ఎత్తిచూపే హక్కు చదువరులందఱికీ ఉంది. కాని ఈ బ్లాగు యొక్క (పైన పేర్కొన్న) స్ఫూర్తికీ, లక్ష్యాలకూ విరుద్ధంగా మూలచ్ఛేదంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం అవి తక్షణమే తొలగించబడతాయి. అందుకు ఆ వ్యాఖ్యాతలే బాధ్యులు. ఎవరినీ వ్యక్తిగతంగా నొప్పించకుండా, కించపఱచకుండా వ్యాఖ్యలు వ్రాయండి.