మన 'సుమతి ' బాబాయిలోని లౌక్యం ఆయనలోని శృంగార రసప్రియత్వాన్ని మరుగుపరచలేదు. ఆ శృంగారానికి ఉన్న హద్దుల్ని సైతం ఆయన మరవలేదు.
క. కసుగాయ కఱచి చూచిన మసలక తెగ వగరు కాక మధురంబగునా ?
పస గలుగు యువతులుండగ పసిబాలల పొందువాడు పశువుర సుమతీ ! (కసుగాయ = పిందె)
అని ఆ రోజుల్లోనే child-abuseని child-traffickingని ఎదుర్కొన్నాడు.వేశ్యాలోలత్వాన్ని అడుగడుగునా వ్యతిరేకించాడు. దానికి నిదర్శనం ఈ పద్యాలే.
క. కాముకుడు తనిసి విడిచిన కోమలి పరవిటుడు కవయగోరుట యెల్లన్
అని ఆ రోజుల్లోనే child-abuseని child-traffickingని ఎదుర్కొన్నాడు.వేశ్యాలోలత్వాన్ని అడుగడుగునా వ్యతిరేకించాడు. దానికి నిదర్శనం ఈ పద్యాలే.
క. కాముకుడు తనిసి విడిచిన కోమలి పరవిటుడు కవయగోరుట యెల్లన్
ప్రేమమున చెరకుపిప్పికి చీమలు వెస మూగినట్లు సిద్ధము సుమతీ !
(తనిసి = తృప్తి చెంది ; కవయగోరుట = అనుభవింప దలచుట ; వెసన్ = వెంటనే)
క. కోమలి విశ్వాసంబును, పాములతో చెలిమి, అన్యభామల వలపున్
(తనిసి = తృప్తి చెంది ; కవయగోరుట = అనుభవింప దలచుట ; వెసన్ = వెంటనే)
క. కోమలి విశ్వాసంబును, పాములతో చెలిమి, అన్యభామల వలపున్
వేముల తియ్యదనంబును భూమీశుల నమ్మికలును బొంకుర సుమతీ !
(కోమలి = స్త్రీ ; చెలిమి = స్నేహం ; అన్యభామలు = పరస్త్రీలు ; వలపు = ప్రేమ ; వేముల = వేపకాయల యొక్క ; భూమీశుల = రాజుల యొక్క ; బొంకు = అబద్ధం)
(కోమలి = స్త్రీ ; చెలిమి = స్నేహం ; అన్యభామలు = పరస్త్రీలు ; వలపు = ప్రేమ ; వేముల = వేపకాయల యొక్క ; భూమీశుల = రాజుల యొక్క ; బొంకు = అబద్ధం)
క. కొక్కోకమెల్ల చదివిన, చక్కనివాడైన రాజచంద్రుండైనన్
మిక్కిలి రొక్కములివ్వక చిక్కదురా వారకాంత సిద్ధము సుమతీ !
(కొక్కోకము = sexology ; మిక్కిలి రొక్కములు = బాగా డబ్బు ; వారకాంత = వేశ్య)
క. తలపొడుగు ధనము పోసిన వెలయాలికి వలపు లేదు వివరింపంగా
తల తడిమి బాసచేసిన వెలయాలిని నమ్మరాదు వినరా సుమతీ !
(వెలయాలికి = వేశ్యకి ; బాసచేసిన = వాగ్దానం చేసినప్పటికీ)
క. నవ్వకుమీ సభలోపల, నవ్వకుమీ తల్లిదండ్రి నాతులతోడన్
నవ్వకుమీ పరసతితో, నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ !
(నాతులు = స్త్రీలు ; విప్రవరులన్ = బ్రాహ్మణోత్తములను ; నయము = నీతి)
క. పరసతి కూటమి గోరకు, పరధనములకాశపడకు పరు నెంచకుమీ !
సరి కాని గోష్ఠి చేయకు, సిరి చెడి చుట్టంబు కడకు చేరకు సుమతీ !
క. పరసతుల గోష్ఠి నుండిన పురుషుడు గాంగేయుడైన పురి నిందపడున్
గరిత సుశీలయె ఐనను పరు సంగతి నున్న నిందపాలగు సుమతీ !
(గోష్ఠి = సాంగత్యం, company ; గాంగేయుడు = భీష్ముడు ; పురిన్ = ఊరిలో ; గరిత = స్త్రీ ; సుశీల = మంచి శీలము గలది ; పరు సంగతిన్ ఉన్నన్ = పరపురుషుడి సాంగత్యంలో ఉంటే)
క. పులిపాలు తెచ్చి యిచ్చిన, అలవడగా గుండె కోసి అరచే నిడినన్
తలపొడుగు ధనము పోసిన వెలయాలికి కూర్మి లేదు వినరా సుమతీ !
(కూర్మి = ప్రేమ)
(కూర్మి = ప్రేమ)
0 వ్యాఖ్యలు ;:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
గమనిక :- ఇది సనాతన, సాంప్రదాయిక, ఆస్తిక, దేశభక్తియుత బ్లాగు.
రచయిత తన టపాలలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో విభేదించి పొఱపాట్లు ఎత్తిచూపే హక్కు చదువరులందఱికీ ఉంది. కాని ఈ బ్లాగు యొక్క (పైన పేర్కొన్న) స్ఫూర్తికీ, లక్ష్యాలకూ విరుద్ధంగా మూలచ్ఛేదంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం అవి తక్షణమే తొలగించబడతాయి. అందుకు ఆ వ్యాఖ్యాతలే బాధ్యులు. ఎవరినీ వ్యక్తిగతంగా నొప్పించకుండా, కించపఱచకుండా వ్యాఖ్యలు వ్రాయండి.